

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టుకు కుల్దీప్ యాదవ్‌ను భారత జట్టు పక్కన పెట్టింది. అనారోగ్యం కారణంగానే అతడిని తుది జట్టులోకి తీసుకోలేదని టీమ్ మేనేజ్‌మెంట్ తెలిపింది. గాలె నుంచి కొలంబోకు ప్రయాణించే సమయంలో కుల్దీప్ ఇబ్బంది పడ్డాడని, వైరల్ ఫీవర్‌తో బాధపడటంతో నెట్స్‌లో కూడా బౌలింగ్ చేయలేకపోయాడని స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే గతంలో వెల్లడించారు. అయితే, ఈ విషయంపై సోషల్ మీడియాలో పలు సందేహాలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ కుల్దీప్ అనారోగ్యంపై స్పష్టత ఇచ్చారు. గాలె నుంచి కొలంబోకు వచ్చిన తర్వాత కుల్దీప్‌కు నిజంగానే వైరల్ ఫీవర్ వచ్చిందని, అతడు పూర్తిస్థాయిలో ఫిట్‌గా లేకపోవడంతో మ్యాచ్‌కు ఎంపిక చేయలేదని తెలిపారు. శ్రీలంక జట్టులో నలుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండటంతో జట్టు కూర్పుపై కూడా చర్చించామని, కుడిచేతి ఆఫ్ స్పిన్నర్ ఉండటం ప్రయోజనకరంగా ఉంటుందని భావించామని చెప్పారు. మరోవైపు జైస్వాల్–అసిత ఫెర్నాండో వాగ్వాదంపై శ్రీలంక బౌలింగ్ కోచ్ రైన్ వాన్ స్పందిస్తూ.. తుది నిర్ణయం మ్యాచ్ రిఫరీదేనని, ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తామని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!