

కేరళంకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మేజో ‘మిస్ యూనివర్స్ ఇండియా 2026’ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. జైపూర్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో 52 మంది ఫైనలిస్టులను అధిగమించి ఆమె విజేతగా నిలిచారు. మావెలిక్కరకు చెందిన కజియా న్యాయ విద్యార్థినిగా, మోడల్‌గా కొనసాగుతున్నారు. శాస్త్రీయ నృత్యంలోనూ శిక్షణ పొందిన ఆమె, గతంలో ‘మిస్ యూనివర్స్ కేరళ 2026’ టైటిల్‌ను గెలుచుకోవడంతో పాటు ‘మిస్ టీన్ ఇంటర్నేషనల్ 2025’లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు.
భారత తొలి మిస్ యూనివర్స్ సుస్మితా సేన్, సెలీనా జైట్లీ, ఊర్వశి రౌతేలా తదితరులతో కూడిన జ్యూరీ సమక్షంలో కజియా తన ప్రతిభ, ఆత్మవిశ్వాసం, వాక్చాతుర్యంతో ఆకట్టుకున్నారు. ఈ విజయంతో నవంబర్‌లో ప్యూర్టో రికోలో జరగనున్న 75వ మిస్ యూనివర్స్ పోటీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. దేశం తరఫున అంతర్జాతీయ వేదికపై కజియా తన సత్తా చాటేందుకు ఉత్సాహంగా ఉన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!