

జార్ఖండ్‌లో పరీక్షల అక్రమాలపై విద్యార్థులు, ఉద్యోగార్థులు చేస్తున్న ఆందోళనకు ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోమవారం కీలక ప్రకటన చేశారు. విద్యార్థుల ప్రధాన డిమాండ్లలో ఒకటైన JSSC-CGL పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే TSR డేటా ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (TDPL) ద్వారా నిర్వహించిన పరీక్షలు, వాటికి సంబంధించిన నియామక ప్రక్రియలను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కేబినెట్ సమావేశం అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించగా.. రాంచీలో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు.
2014 నుంచి జార్ఖండ్‌లో నిర్వహించిన నియామక పరీక్షల్లో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సమగ్ర దర్యాప్తునకు సీఎం సోరెన్ ఆదేశించారు. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడంతో పాటు భవిష్యత్తులో నియామక ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. JSSC-CGL రద్దు విద్యార్థుల ఆందోళనకు కీలక విజయం కాగా.. సీబీఐ దర్యాప్తు కోరుతున్న కొన్ని విద్యార్థి సంఘాలు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెబుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!