
జనరల్

వినాయకుడి పండుగ సీజన్ నేపథ్యంలో రైలు ప్రయాణాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ నెల 7న ఒక్క రోజులోనే 20,06,353 రైల్వే టికెట్లు బుక్ అయ్యాయి. ఐఆర్‌సీటీసీ చరిత్రలో ఒకే రోజులో 20 లక్షల టికెట్ల మార్క్ దాటడం ఇదే తొలిసారి. ఈ నెల 8న కూడా బుకింగ్స్ భారీగా కొనసాగి 19,50,699 టికెట్లు నమోదయ్యాయి.
గత ఏడాది పండుగ సీజన్‌లో ఒక్క రోజులో అత్యధికంగా 18,40,203 టికెట్లు బుక్ కాగా, ఈసారి దానికంటే సుమారు 6 శాతం అధికంగా నమోదయ్యాయి. ప్రస్తుతం రిజర్వేషన్ టికెట్లలో దాదాపు 89 శాతం ఆన్‌లైన్‌లోనే బుక్ అవుతున్నాయని ఐఆర్‌సీటీసీ తెలిపింది. పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని కొత్త సర్వర్లను ఏర్పాటు చేయడంతో ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సామర్థ్యం దాదాపు రెట్టింపు అయిందని పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!