
గాసిప్స్

నిర్మల్ జిల్లాలోని బాసర అమ్మవారి ఆలయంలో చోరీ ఘటన చోటుచేసుకుంది. సరస్వతీ అమ్మవారి ఆలయ పై అంతస్తులో ఉన్న మహంకాళి ఆలయంలో వెండి కిరీటం, హుండీని గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. ఆలయ గేటును పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు నగదు తీసుకుని హుండీని వ్యాసగుడి వద్ద పడేసి పరారయ్యారు.
మంగళవారం తెల్లవారుజామున పూజలకు వచ్చిన అర్చకులకు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!