

బాలీవుడ్ దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పాత కథనాలు మరోసారి చర్చకు వచ్చాయి. సినిమాల్లో ఎన్నో విజయాలు సాధించిన మిథున్ వ్యక్తిగత జీవితంలోనూ ప్రేమ, వివాహాలు, వివాదాలకు సంబంధించిన పలు వార్తలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. 1979లో మోడల్, నటి హెలెనా లూక్ను వివాహం చేసుకున్న మిథున్ ఆ తర్వాత ఆమెతో విడిపోయారు. అనంతరం నటి యోగితా బాలి ఆయన జీవితంలోకి వచ్చారు. వీరిద్దరూ వివాహం చేసుకోగా, వారికి ముగ్గురు కుమారులు జన్మించారు. దిశానిని దత్తత తీసుకున్నారు.
1985లో ‘జాగ్ ఉతా ఇన్సాన్’ సినిమా చిత్రీకరణ సమయంలో మిథున్ చక్రవర్తి, శ్రీదేవి మధ్య సాన్నిహిత్యం పెరిగిందనే వార్తలు అప్పట్లో వచ్చాయి. వీరిద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారనే ప్రచారం కూడా బాలీవుడ్లో సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారం యోగితా బాలి తీవ్రంగా కలత చెందేలా చేసిందని, ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించారనే కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే మిథున్, శ్రీదేవి సంబంధానికి సంబంధించిన అనేక విషయాలు అప్పటి మీడియా కథనాలు, ప్రచారాల ఆధారంగానే వెలుగులోకి వచ్చాయి. వాటిలో ఏవి వాస్తవాలు, ఏవి ఊహాగానాలు అనే దానిపై పూర్తి స్పష్టత లేదు. అయినప్పటికీ మిథున్ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించిన ప్రతిసారీ శ్రీదేవితో ఆయనకు సంబంధించిన ఈ అధ్యాయం చర్చకు వస్తూనే ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!