

సినిమా రంగంలో వయసు పెరుగుతున్న కొద్దీ తమ లుక్స్‌ను కాపాడుకునేందుకు నటీనటులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే నటుడు ఆర్. మాధవన్ మాత్రం అందుకు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వయసు పెరగడాన్ని, తెల్ల జుట్టును తాను సహజంగా స్వీకరిస్తానని తెలిపారు. పాత్రకు అవసరమైతే తప్ప జుట్టుకు రంగు వేసుకోనని, తెర వెనుక సహజంగా కనిపించడానికే ఇష్టపడతానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ విషయంలో రజనీకాంత్ నుంచి తాను స్ఫూర్తి పొందానని, ఆఫ్‌స్క్రీన్ లుక్ గురించి పెద్దగా పట్టించుకోకుండా స్క్రీన్‌పై అద్భుతం చేయడం ఆయన ప్రత్యేకత అని అన్నారు. తన మిత్రుడు అజిత్ కుమార్ కూడా ఇలాగే ఉంటారని మాధవన్ పేర్కొన్నారు.
కెరీర్ పరంగా ప్రస్తుతం తాను చాలా ప్రశాంతంగా ఉన్నానని మాధవన్ తెలిపారు. చిన్నవాడిలా కనిపించాలనే తాపత్రయం తనకు లేదని, ఇండస్ట్రీలో ఎవరితోనూ పోటీ పడటం లేదని చెప్పారు. తన నటనను మరింత మెరుగుపరుచుకోవడమే తనకు అసలైన పోటీ అని, తాను ఎలా ఉన్నానో అలాగే మనస్ఫూర్తిగా ఇష్టపడతానని పేర్కొన్నారు. విభిన్న కథాంశాలను ఎంచుకునే మాధవన్ తాజాగా భారతీయ ఎడిసన్‌గా పేరుగాంచిన జి.డి. నాయుడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్‌లో నటించారు. కృష్ణకుమార్ రామ్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాధవన్ తన నటనతో ఆకట్టుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!