

జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును ఓ గుర్తుతెలియని వ్యక్తి ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. కోరుట్ల డిపోకు చెందిన టీఎస్08 జెడ్0103 నంబరు బస్సును డ్రైవర్ ప్రవీణ్ 8వ ప్లాట్‌ఫాంపై నిలిపి, కండక్టర్‌తో కలిసి పక్కకు వెళ్లిన సమయంలో దుండగుడు బస్సును తీసుకుని నిజామాబాద్ వైపు వెళ్లాడు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
బస్సును వెంబడించిన పోలీసులు 18 కిలోమీటర్ల దూరంలో దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అతడు కోరుట్ల, ఆరపేట, వెంకట్రావుపేట ప్రాంతాల్లో మూడు ద్విచక్ర వాహనాలను, పోలీసు వాహనాన్ని ఢీకొట్టి బీభత్సం సృష్టించాడు. ఇబ్రహీంపట్నం పోలీసులు రహదారిపై వాహనాలను అడ్డుగా నిలపడంతో బస్సు ఆగిపోయింది. పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు పట్టుకుని విచారణ చేపట్టారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!