

బాల కార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణా నిర్మూలన లక్ష్యంగా తెలంగాణ పోలీసులు జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్-12లో రాష్ట్రవ్యాప్తంగా 6,307 మంది చిన్నారులను రక్షించారు. మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో మహిళా–శిశు సంక్షేమ, కార్మిక, వైద్య శాఖలు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, జిల్లా బాలల సంరక్షణ విభాగాలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు.
రక్షించిన చిన్నారుల్లో 5,041 మంది బాల కార్మికులు కాగా, వీధి బాలలు, భిక్షాటన చేస్తున్న చిన్నారులు, ఇంటి నుంచి పారిపోయిన వారు, బాల్య వివాహాలు, అక్రమ దత్తత బాధితులు కూడా ఉన్నారు. ఈ ఆపరేషన్‌లో 1,705 కేసులు నమోదు చేసి, 1,710 మందిని అరెస్టు చేశారు. రక్షించిన వారిలో 5,737 మందిని కుటుంబాలకు అప్పగించగా, 570 మందిని బాలల సంరక్షణ కేంద్రాలకు తరలించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో తెలంగాణ మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచిందని అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!