

భూమిపై వనరులు క్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాల దృష్టి ఇప్పుడు చందమామపై పడింది. ముఖ్యంగా భవిష్యత్ సాంకేతిక విప్లవానికి కీలకంగా భావిస్తున్న హీలియం-3 అనే అరుదైన ఐసోటోప్‌ను సేకరించేందుకు అమెరికా, చైనా, భారత్, జపాన్‌తో పాటు పలు ప్రైవేట్ సంస్థలు పోటీపడుతున్నాయి. ఆర్టెమిస్ వంటి మిషన్ల ద్వారా చంద్రుడిపై స్థావరాల ఏర్పాటు, వనరుల వినియోగంపై ప్రణాళికలు వేగంగా ముందుకు సాగుతున్నాయి.
హీలియం-3 భవిష్యత్‌లో న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా అపరిమిత విద్యుత్ ఉత్పత్తి, క్వాంటమ్ కంప్యూటింగ్, అధునాతన వైద్య పరికరాల అభివృద్ధికి కీలకంగా మారనుంది. చంద్రుడి మట్టిలో ఇది భారీ పరిమాణంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే దానిని వెలికితీయడానికి లక్షల టన్నుల మట్టిని ప్రాసెస్ చేయాల్సి ఉండటం, చంద్రుడి కఠిన వాతావరణ పరిస్థితులు, అధిక వ్యయాలు వంటి సవాళ్లు ఉన్నాయి. అయినప్పటికీ కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, అంతరిక్ష సాంకేతికతలో పురోగతితో ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పోటీ వేగంగా పెరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!