

గూగుల్ ఏఐ ప్రాజెక్టులో భాగంగా విశాఖపట్నంలో అదానీకనెక్స్ నిర్మిస్తున్న కృత్రిమ మేధ డేటా సెంటర్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలు తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి. ఒక్కో మెగావాట్ నిర్మాణానికి రూ.70 నుంచి రూ.75 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అదానీ గ్రూప్ సీఎఫ్‌ఓ జుగేశిందర్ సింగ్ తెలిపారు. డాలర్లలో 12 శాతం లాభాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అదానీ గ్రూప్ మరియు ఎడ్జ్‌కనెక్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి.
మొత్తం 1 గిగావాట్ సామర్థ్యంతో ప్రణాళిక చేసిన ఈ ప్రాజెక్టులో తొలి దశగా 400 మెగావాట్ల నిర్మాణం జరుగుతోంది. దీనికి సుమారు రూ.30,000 కోట్ల పెట్టుబడి అవసరమని అంచనా. 2025 అక్టోబరులో ప్రకటించిన ఈ ప్రాజెక్టును భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన ఎన్‌ఎక్స్‌ట్రాతో కలిసి అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుతో విశాఖపట్నం అంతర్జాతీయ టెక్ హబ్‌గా మారే అవకాశముందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!