

కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన అంశం, దాని వల్ల తమిళనాడుపై పడే ప్రభావం, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఇతర సమస్యలపై చర్చించేందుకు సీఎం విజయ్ నేతృత్వంలో చెన్నైలో నేడు అఖిలపక్ష ఎంపీల సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ భేటీకి తమిళనాడులోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలను సీఎం విజయ్ ఆహ్వానించారు.
నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్ర రాజకీయ ప్రాతినిధ్యంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. డీలిమిటేషన్‌తో పాటు తమిళనాడు ప్రయోజనాలు, రాష్ట్ర సమస్యలపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశాన్ని బహిష్కరించాలని డీఎంకే నిర్ణయించినట్లు సమాచారం. వివిధ పార్టీల ఎంపీల అభిప్రాయాలను తెలుసుకుని రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!