

మూసీ నది పునరుజ్జీవన ఫేజ్-2 పనులను నాగోల్ నుంచి గౌరెల్లి వరకు 100 రోజుల్లో ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు మొదటి దశ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఈ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో రూ.1,511 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఇందులో రూ.98 కోట్లతో మున్సిపల్ కార్పొరేషన్ భవనం, రూ.960 కోట్లతో ప్రత్యామ్నాయ రోడ్లు, రూ.416 కోట్లతో ఆరు వరుసల ఫ్లైఓవర్, రూ.37.50 కోట్లతో 100 పడకల జిల్లా ఆస్పత్రి నిర్మాణం ఉన్నాయి.
హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మెట్రో విస్తరణ, పరిపాలనా వికేంద్రీకరణ, క్యూర్-1 ఏకీకృత బిల్లింగ్ వ్యవస్థ వంటి అంశాలను ముఖ్యమంత్రి వివరించారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజల పునరావాసం, కాలుష్య నియంత్రణ, మౌలిక వసతుల అభివృద్ధి అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!