
జనరల్

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుతం విడుదల చేస్తున్న నీటిని కేవలం తాగునీటి అవసరాల కోసం మాత్రమే వినియోగించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజ కుమారి గణియా తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి విడుదలవుతున్న నీటిని వెలుగోడు, గోరుకల్లు, అవుకు రిజర్వాయర్లలో తాగునీటి అవసరాలకు అనుగుణంగా నిల్వ చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులు వరి సాగు చేపట్టకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని మినుములు, కంది, పెసర, కొర్ర, ఆముదం, సోయాబీన్ వంటి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నీటి వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!