

అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణుల సంరక్షణలో తెలంగాణ అటవీ శాఖ చేపడుతున్న కృషికి మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. మౌస్ డీర్ సంరక్షణ, బ్రీడింగ్ మరియు అడవుల్లోకి పునరావాస కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసినందుకు నెహ్రూ జూలాజికల్ పార్క్ ప్రతిష్టాత్మక స్కాచ్ (SKOCH) అవార్డును అందుకుంది. వన్యప్రాణుల సంరక్షణ విభాగంలో ఈ అవార్డును అందుకున్న దేశంలోని తొలి జూపార్క్‌గా నెహ్రూ జూలాజికల్ పార్క్ రికార్డు సృష్టించింది.
న్యూఢిల్లీలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ వసంత ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ ఉన్నతాధికారుల మార్గదర్శకత్వం, జూ సిబ్బంది కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆమె తెలిపారు. ఈ ఘనత సాధించిన జూ అధికారులు, సిబ్బందిని రాష్ట్ర అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అభినందించారు. భవిష్యత్తులో కూడా జీవ వైవిధ్య పరిరక్షణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!