
రాజకీయాలు

బోనాల పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, బార్లను మూసివేయాలని పోలీస్ కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు. పండుగ సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. చార్మినార్ జోన్ పరిధిలో ఆగస్టు 9 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 11 ఉదయం 10 గంటల వరకు వైన్ షాపులు, బార్లు పూర్తిగా మూసివేయనున్నారు.
అదేవిధంగా రాజేంద్రనగర్, గోల్కొండ, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో ఆగస్టు 9 నుంచి 10 వరకు 24 గంటల పాటు మద్యం దుకాణాలు బంద్ ఉంటాయి. సైబరాబాద్ పరిధిలోని కూకట్‌పల్లి, రాయదుర్గం, జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఆగస్టు 9న రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయ కేంద్రాలు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లోని వైన్ షాపులు, బార్లు తప్పనిసరిగా ఆదేశాలను పాటించాలని పోలీసులు స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!