
జనరల్

నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వరదల ప్రభావంతో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా అధికారిక నివేదికల ప్రకారం మృతుల సంఖ్య 270కి చేరగా, చిత్వాన్‌లో 100కుపైగా మృతదేహాలు లభ్యమైనట్లు సమాచారం.
మరోవైపు వందలాది మంది ఇంకా ఆచూకీ లేకుండా పోయారు. నేపాల్‌లోనే 826 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో స్థానికులతో పాటు విదేశీ పర్యాటకులు, యాత్రికులు కూడా ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నేపాల్ సైన్యం, పోలీసులు, ఇతర భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు, సహాయక చర్యలు చేపడుతున్నాయి. దెబ్బతిన్న రహదారులు, వంతెనల కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ, గల్లంతైనవారి కోసం గాలింపు కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!