

తెలంగాణలో మహిళా సాధికారతకు కొత్త వేదికలు రూపుదిద్దుకుంటున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జిల్లాల వారీగా నిర్మాణం పూర్తిచేసుకుని ప్రారంభానికి సిద్ధమవుతున్న ‘ఇందిరా మహిళా శక్తి భవనాలు’ మహిళల ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంబనకు కేంద్రాలుగా మారనున్నాయని సీఎం తన ట్వీట్‌లో పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో శిక్షణ, ఉపాధి అవకాశాలు, ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, విస్తృత మార్కెట్లకు చేరుకునే అవకాశాలను ఒకే వేదికపై అందించేందుకు ఈ భవనాలు కీలకంగా నిలవనున్నాయని తెలిపారు.
ఒక మహిళకు అవకాశం లభిస్తే ఒక కుటుంబ భవిష్యత్తు మారుతుందని, రాష్ట్రంలో మహిళలకు అవకాశాలు పెరిగితే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘మహిళా ఉన్నతి – తెలంగాణ ప్రగతి’ అనే ఆశయంతో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతకు మరింత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. మహిళల ఆర్థిక పురోగతితో తెలంగాణ అభివృద్ధి ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!