

కాళేశ్వరం ప్రాజెక్టు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మధ్య పరస్పర సవాళ్లతో సభలో చర్చ వేడెక్కింది. NDSA నివేదికపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ, తదుపరి చర్యలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏలేటి ఆరోపణలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. NDSA నివేదిక, దాని సిఫార్సుల ప్రకారమే ప్రభుత్వం ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. ఏలేటి చెబుతున్న అంశాలను నిరూపించాలని సవాల్ విసిరిన ఉత్తమ్.. ఆరోపణలు నిజమని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఈ సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. కాళేశ్వరం బ్యారేజీల భద్రత, పునరుద్ధరణ, NDSA సూచనల అమలు అంశాలు అసెంబ్లీ చర్చలో ప్రధానంగా నిలిచాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!