

మినరల్స్ (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) సవరణ బిల్లు, 2026కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఖనిజ హక్కులు, ఖనిజాలు ఉన్న భూములపై పన్నులు, సెస్‌లు, ఇతర రుసుములు విధించే అధికారాలను ఈ బిల్లు గణనీయంగా పరిమితం చేస్తుంది. ఆగస్టు 12న లోక్‌సభ ఆమోదించిన బిల్లుకు ఆగస్టు 13న రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇది చట్టంగా మారనుంది.
అలాగే గతంలో పెండింగ్‌లో ఉన్న ఖనిజ పన్ను బకాయిలను రాష్ట్రాలు తిరిగి వసూలు చేయకుండా బిల్లు నిబంధనలు కల్పిస్తున్నాయి. అయితే ఇప్పటికే వసూలు చేసిన పన్నులు, లెవీలను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఖనిజ రంగంలో ఏకరీతి, ముందస్తుగా అంచనా వేయగల పన్నుల విధానాన్ని తీసుకురావడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ఖనిజ ఉత్పత్తిని పెంచడం ఈ సవరణ లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!