

నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్‌ఎస్‌టీఆర్) పరిధిలోని గిద్దలూరు డివిజన్, రాచర్ల బీట్‌లో పులి మరణించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో పులుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటూ, ఈ ఘటనపై సమగ్ర, పారదర్శక విచారణ చేపట్టాలని ఎన్‌ఎస్‌టీఆర్ ఫీల్డ్ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
పులి మరణం సహజ కారణాలతో జరిగిందా లేదా వేటగాళ్ల దుశ్చర్య, విషప్రయోగం వంటి మానవ ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరపాలని ఆయన సూచించారు. వన్యప్రాణి సంరక్షణ నిబంధనల ప్రకారం పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి అసలు కారణాన్ని నిర్ధారించాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అడవుల్లో పెట్రోలింగ్, నిఘాను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచిస్తూ, ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!