
క్రీడలు

ప్రముఖ హర్యాన్వీ జానపద గాయకుడు, రాగ్‌నీ కళాకారుడు పెప్సీ శర్మ గుండె నొప్పితో అస్వస్థతకు గురై కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్ జిల్లా పట్లా గ్రామానికి చెందిన ఆయన తన శక్తివంతమైన గానం, ఉత్సాహభరితమైన వేదిక ప్రదర్శనలతో హర్యానా, ఉత్తరప్రదేశ్‌తో పాటు పలు ప్రాంతాల్లో విశేష గుర్తింపు పొందారు.
రాగ్‌నీ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో తరచూ పాల్గొనే పెప్సీ శర్మ, సప్నా చౌదరి, రాధా చౌదరి వంటి ప్రముఖ కళాకారులతో కలిసి వేదిక పంచుకున్నారు. సోనోటెక్ సహా పలు మ్యూజిక్ లేబుల్స్‌తో చేసిన పాటలు ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆయన మరణ వార్తతో రాగ్‌నీ కళా ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. అభిమానులు, సహచర కళాకారులు సోషల్ మీడియా వేదికగా ఘన నివాళులు అర్పిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!