

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఇది దేశ యువత భవిష్యత్తుతో ఆడుకునే ఘోరమైన నేరమని పేర్కొన్నారు. ఎన్డీయే ఎంపీల సమావేశంలో తొలిసారి ఈ అంశంపై స్పందించిన ప్రధాని.. లీకేజీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. యువత విశ్వాసాన్ని పొందేలా ఎంపీలు ప్రజలతో మరింత అనుసంధానం కావాలని పిలుపునిచ్చారు.
నీట్ లీకేజీ, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, దేశ ఆర్థిక పురోగతి వంటి అంశాలపై ప్రధాని సమావేశంలో మాట్లాడినట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. విద్యార్థుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, అక్రమాలకు పాల్పడిన వారిపై ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే లీకేజీ కేసులో 13 మందిని అరెస్టు చేసి, న్యాయపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!