
జనరల్

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు అధికారిక పర్యటనలో భాగంగా విశాఖపట్నంకు రానున్నారు. సాయంత్రం 6:10 గంటలకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకోనున్న రాష్ట్రపతికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం నేవల్ బేస్‌లో రాష్ట్రపతి గౌరవార్థం బాంక్వెట్ విందు ఏర్పాటు చేశారు.
రేపు నిర్వహించనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక నౌకాదళ కార్యక్రమంలో సముద్ర రక్షణ సామర్థ్యాలు, నౌకాదళ శక్తి ప్రదర్శించనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో విశాఖపట్నంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయడంతో పాటు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!