

కృతి సనన్ నటించిన రక్షాబంధన్ ప్రకటనపై కొనసాగుతున్న వివాదానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. కృతికి మద్దతుగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఆయన.. మహిళలు ధరించే దుస్తులపై జరుగుతున్న ట్రోలింగ్‌ను తీవ్రంగా తప్పుపట్టారు. ఒక మహిళ ఏ దుస్తులు ధరించాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్లాలి అనేది పూర్తిగా ఆమె వ్యక్తిగత ఎంపిక అని పేర్కొన్నారు. స్వేచ్ఛగా జీవించాలనుకునే మహిళలను ట్రోల్ చేయడం మానుకోవాలని సూచించారు. దీంతో ఈ వివాదం మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ, దుస్తుల ఎంపికపై చర్చకు దారితీసింది.
ఇప్పటికే ప్రకటనపై వచ్చిన విమర్శలకు కృతి సనన్ ఘాటుగా స్పందించారు. పండగల అసలు అర్థం మనం ధరించే దుస్తుల్లో కాకుండా ప్రేమ, ఆప్యాయత, బంధాల్లో ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. కృతి సోదరి నుపూర్ సనన్ కూడా ట్రోలర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కృతి తనకు కూడా రాఖీ కడుతుందని, తనకు ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు ఇతరులకు ఎందుకు ఇబ్బంది అని ప్రశ్నించారు. మరోవైపు నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సంప్రదాయ పండగకు తగిన దుస్తులు ధరించలేదంటూ కృతి ప్రకటనపై విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన కృతి.. మహిళలు ఏ దుస్తులు ధరించాలో చెప్పడం ఎప్పుడు ఆపుతారని ప్రశ్నించారు. ఈ పరిణామాలతో రక్షాబంధన్ ప్రకటనపై సోషల్ మీడియాలో వాడివేడి చర్చ కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!