

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసిన అన్ని సంప్రదాయ క్షిపణి వ్యవస్థలను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు భారత పరిశ్రమలకు బదిలీ చేయడానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారికంగా ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. దేశ రక్షణ తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం కీలక ముందడుగుగా పేర్కొంది.
రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని సాధించడం, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, దేశీయ తయారీ సామర్థ్యాలను పెంచడం ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యాలని రక్షణ శాఖ తెలిపింది. DRDO అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం, క్షిపణి వ్యవస్థలను భారతీయ పరిశ్రమలకు అందించడం ద్వారా దేశీయ రక్షణ ఉత్పత్తులకు మరింత ఊతం లభించే అవకాశం ఉంది. దీని ద్వారా రక్షణ రంగంలో ప్రైవేట్, దేశీయ తయారీ సంస్థల భాగస్వామ్యం కూడా పెరగనుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!