

దేశంలో పాలీమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక ప్రకటన చేసింది. కరెన్సీ నోట్ల మన్నిక, భద్రత, దీర్ఘకాల వినియోగాన్ని మెరుగుపరచే లక్ష్యంతో పాలీమర్ ఆధారిత నోట్లను చలామణిలోకి తీసుకురావడానికి అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. నకిలీ నోట్ల నియంత్రణతో పాటు నోట్ల ఆయుష్షును పెంచడంలో ఈ చర్య ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
సమాచారం ప్రకారం, పైలట్ ప్రాజెక్ట్ కింద తొలుత రూ.10, రూ.20 పాలీమర్ నోట్లను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో ఇతర విలువల నోట్లకూ పాలీమర్ సాంకేతికతను విస్తరించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో పాలీమర్ నోట్లు విజయవంతంగా వినియోగంలో ఉండగా, సంప్రదాయ కాగితపు నోట్లతో పోలిస్తే ఇవి మరింత మన్నికగా, భద్రతాపరంగా మెరుగ్గా ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!