

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టనుంది. 2027 ఏప్రిల్‌లో పైలట్ ప్రాజెక్టుగా రూ.10, రూ.20 విలువైన పాలిమర్ నోట్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.
పైలట్ ప్రాజెక్టు ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో ఇతర డినామినేషన్లలోనూ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టాలా అనే నిర్ణయం తీసుకుంటామని ఆర్‌బీఐ తెలిపింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లను పూర్తిగా తొలగించే ఆలోచన లేదని, రెండు రకాల నోట్లు చెల్లుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. రూ.10, రూ.20 విలువైన ప్లాస్టిక్ నోట్లు చెరో 100 కోట్ల చొప్పున మొత్తం 200 కోట్ల నోట్ల ముద్రణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!