
జనరల్

పాత వాహనాలను స్క్రాప్‌కు ఇచ్చిన తర్వాత వాటి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) తప్పనిసరిగా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వాహనాలను కేవలం అధీకృత స్క్రాపింగ్ కేంద్రాల్లోనే తుక్కుగా మార్చాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు పాటించకపోతే పూర్తి చట్టపరమైన బాధ్యత వాహన యజమానులదేనని హెచ్చరించింది.
స్క్రాపింగ్ విధానాన్ని సరైన విధంగా అనుసరిస్తేనే రాయితీలు లభిస్తాయని కేంద్రం పేర్కొంది. పాత వాహనాల డీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియను కఠినతరం చేస్తూ పర్యావరణ భద్రత, రవాణా వ్యవస్థ నియంత్రణకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!