

విజయవాడలో నేటి నుంచి రెండు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మిషన్ కర్మయోగి సదస్సు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సదస్సును ప్రారంభించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్యాన్ని పెంపొందించడం, పరిపాలనా నైపుణ్యాలను మెరుగుపరచడం, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేలా అధికారులను తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నారు. శిక్షణ, సామర్థ్య నిర్మాణం, సమర్థవంతమైన పరిపాలనకు సంబంధించిన అంశాలపై సదస్సులో చర్చించనున్నారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరికి చెందిన ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాభివృద్ధి కోసం అమలు చేస్తున్న విధానాలు, ఉత్తమ పద్ధతులపై అనుభవాలను పంచుకునే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సు ద్వారా పరిపాలనా వ్యవస్థలో నైపుణ్యాలు, సామర్థ్యాల పెంపుపై దృష్టి సారించనున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!