
సినిమాలు

పాకిస్థాన్‌లోని బహావల్‌నగర్‌లో ఆగస్టు 14న జరిగిన ఓ సమావేశంలో ఓ పాక్ మతబోధకుడు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కశ్మీర్‌లోకి 10 వేల మంది ఉగ్రవాదులను పంపినట్లు ఆయన పేర్కొన్నారు. లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) అధినేత ఈ వ్యక్తులను కశ్మీర్‌కు పంపించారని ఆయన వెల్లడించినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీశాయి.
లష్కరే తోయిబాను అమెరికా ఇప్పటికే ఉగ్రవాద సంస్థగా నిషేధించింది. ఆ సంస్థ అధినేతపై భారత్‌లోనూ పలు కేసులు నమోదయ్యాయి. పాక్ మతబోధకుడి వ్యాఖ్యలు సరిహద్దు ఉగ్రవాదం, కశ్మీర్‌లో హింసకు సంబంధించిన అంశాలపై మరోసారి చర్చకు దారి తీశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!