
జనరల్

భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధానను కళ్యాణ్ జ్యువెలర్స్కు చెందిన ప్రముఖ లైఫ్‌స్టైల్ జ్యువెలరీ బ్రాండ్ కాండెరే తన కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. ఈ బ్రాండ్‌కు ఇప్పటికే అంబాసిడర్‌గా ఉన్న బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్తో కలిసి స్మృతి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననుంది. రోజువారీగా జ్యువెలరీ ధరించే యువతను ఆకర్షించడమే ఈ నిర్ణయ లక్ష్యంగా కంపెనీ తెలిపింది.
సమాచారం ప్రకారం, స్మృతి మంధాన ఒక్కో బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుండగా, షారుఖ్ ఖాన్ రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు అందుకుంటున్నారు. ఈ ఇద్దరు ప్రముఖుల ద్వారా దేశవ్యాప్తంగా మరింత విస్తృతమైన వినియోగదారులను చేరుకోవాలని కాండెరే భావిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!