
జనరల్

దేశంలో ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ(FSSAI) ప్రముఖ ఎనర్జీ డ్రింక్స్ తయారీ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. రెడ్ బుల్, స్టింగ్, హెల్ ఎనర్జీ, క్యాంపా ఎనర్జీ, గోల్డ్ బూస్ట్, అడ్రినలిన్ రష్, మాన్స్టర్ ఎనర్జీ వంటి బ్రాండ్లు తమ ఉత్పత్తులు శక్తిని, ఏకాగ్రతను, ఉత్సాహాన్ని పెంచుతాయని ప్రచారం చేయడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
భారత్‌లో "ఎనర్జీ డ్రింక్స్" పేరుతో ప్రత్యేక ప్రమాణాలు లేదా అనుమతులు లేవని FSSAI స్పష్టం చేసింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తప్పుడు బ్రాండింగ్‌పై చర్యలు ప్రారంభించినట్లు తెలిపింది. నోటీసులకు స్పందించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!