

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పడిపోయిందని సునీల్ కనుగోలు నివేదిక వెల్లడించిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మైనార్టీ ఓటర్ల మద్దతు ఉంటేనే కాంగ్రెస్ మూడో స్థానంలో నిలుస్తుందని, లేకపోతే పోటీలో ఉండటం కూడా కష్టమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై నిర్వహించిన సర్వేలో అన్ని వర్గాలు కాంగ్రెస్‌కు దూరమవుతున్నట్లు తేలిందని చెప్పారు. అన్ని ఉమ్మడి జిల్లాల్లో బీజేపీ బలపడిందని, సీఎం సొంత జిల్లా పాలమూరులో కూడా కాంగ్రెస్ వెనుకబడిందని నివేదిక స్పష్టం చేసిందన్నారు. ప్రస్తుతం అక్కడ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు రెండు సీట్లు రావడం కూడా కష్టమని పేర్కొన్నారు.
ఇక పార్టీ అంతర్గత పరిస్థితులు కూడా ఆందోళనకరంగా ఉన్నాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించాయని, మంత్రులు మరియు సీఎంమధ్య విభేదాలు పెరిగాయని చెప్పారు. కేబినెట్‌లో సమన్వయం లేకపోవడంతో ఎమ్మెల్యేలు, డిప్యూటీ సీఎం కూడా అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పుపై ఒత్తిడి పెరుగుతుండగా, కేంద్ర నాయకత్వంలోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయని వెల్లడించారు. ఎమ్మెల్యేలు సీఎంను కలవడానికే ఇబ్బందులు పడుతున్నారని, పార్టీ భవిష్యత్తుపై కేడర్‌లో అనిశ్చితి నెలకొన్నదని ఆయన వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!