

ఇటీవల శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) చైర్మన్‌గా నియమితులైన శ్రీధర్ వర్మ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు శ్రీధర్ వర్మకు శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు. అనంతరం టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర, తిరుపతి జేఈఓ శరత్‌ను కలిసి నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవి నాయుడు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ తోట వాసు తదితరులు పాల్గొన్నారు.

అనంతరం శ్రీధర్ వర్మ టీటీడీ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యుడు సంతారావును కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్వీబీసీ బోర్డు సమావేశంలో ఆమోదించిన తీర్మానం మేరకే శ్రీధర్ వర్మను చైర్మన్‌గా నియమించినట్లు టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర తెలిపారు. ఆయన నాయకత్వంలో ఎస్వీబీసీ మరింత అభివృద్ధి సాధించి, కొత్త శిఖరాలను చేరుకుంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీధర్ వర్మ ఈ నెల 22న ఎస్వీబీసీ చైర్మన్‌గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!