
సినిమాలు

సాయికృష్ణ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విజయవాడలోని సిట్ కార్యాలయంలో సీఐ నాగరాజును ఏడు రోజుల పాటు విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) అనుమతి ఇచ్చింది. ఈ కేసులో మిగిలిన షరతులు యథావిధిగా కొనసాగుతాయని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, విచారణ అనంతరం ఈ మేరకు అనుమతి లభించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రేపటి నుంచి సీఐ నాగరాజును కస్టడీలోకి తీసుకుని కేసుకు సంబంధించి సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!