

భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ కొనసాగుతోంది. వెస్టిండీస్‌తో జరగనున్న మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌ల కోసం భారత జట్ల ఎంపికకు సెప్టెంబర్ 16న సెలక్షన్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశమే చీఫ్ సెలెక్టర్‌గా అగార్కర్‌కు చివరి సమావేశం కావచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనను కొనసాగించాలా వద్దా అనే అంశంపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
అగార్కర్ ప్రస్తుత పదవీకాలం అక్టోబర్ 4తో ముగియనుంది. గతంలో ఆయన పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించారు. 2027 వన్డే ప్రపంచకప్ ముగిసే వరకు ఆయన చీఫ్ సెలెక్టర్‌గా కొనసాగుతారని గతంలో వార్తలు వచ్చినప్పటికీ, తాజా పరిణామాలతో ఆ ప్రణాళికపై అనిశ్చితి నెలకొంది. వెస్టిండీస్ సిరీస్ జట్ల ఎంపిక పూర్తయిన తర్వాత బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియాకు అగార్కర్ ‘థ్యాంక్యూ నోట్’ పంపే అవకాశం ఉందని పీటీఐ తెలిపింది. భారత క్రికెట్‌కు మూడేళ్ల పాటు సేవ చేసే అవకాశం కల్పించినందుకు బీసీసీఐకి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ఈ లేఖ రాయనున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!