
జనరల్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు రాష్ట్ర మంత్రి పి. నారాయణ, ఎంపీలు కేశినేని శివనాథ్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, దేవాదాయశాఖ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం విజయ్ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనం అనంతరం ఆలయ పండితులు విజయ్కు వేదాశీర్వచనం అందించారు. దేవస్థానం అధికారులు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ కార్యదర్శి కె. కన్నబాబు, కమిషనర్ కె. రామచంద్రమోహన్, ఆలయ పాలక మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈఓ వీకే శీనానాయక్ తదితరులు పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!