

తమిళనాడులో పోలీసు కస్టడీలో మృతి చెందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 26 ఏళ్ల యువకుడు ఆకాష్ డెలిసన్కు 102 రోజుల తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. శివగంగై జిల్లా మానామదురైకు చెందిన ఆకాష్‌ను మార్చి 6న ఓ కేసు విచారణ నిమిత్తం పోలీసులు తీసుకెళ్లగా, గాయపడిన స్థితిలో మదురై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మార్చి 8న అతను మృతిచెందాడు. పోస్టుమార్టం నివేదికలో అతని శరీరంపై 28 గాయాలు ఉన్నట్లు గుర్తించడంతో హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి.
ఈ ఘటనపై పలువురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. మరోవైపు బాధితుడి కుటుంబం న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తూ, మృతదేహాన్ని స్వీకరించకుండా నిరసన వ్యక్తం చేసింది. దీంతో ఆకాష్ మృతదేహాన్ని 102 రోజుల పాటు మదురై ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచారు. ఆరుగురు పోలీసులను అరెస్టు చేయాలని, రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. చివరకు మదురై ధర్మాసనం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, కమిషనర్, ఆసుపత్రి డీన్ పర్యవేక్షణలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!