
జనరల్

ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప ఘన విజయం సాధించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌పై 37,172 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయంతో ఒంగోలులో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
ఒంగోలు నగరపాలక సంస్థలో మొత్తం 62 డివిజన్లు ఉండగా.. టీడీపీ 39 స్థానాల్లో, వైఎస్సార్‌సీపీ 11 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, భాజపా ఒక స్థానంలో విజయం సాధించాయి. ఇతరులు మూడు స్థానాలను దక్కించుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఓట్ల లెక్కింపు నిన్న ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. భారీ వర్షాల కారణంగా ఆలస్యమైంది. దీంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇవాళ మధ్యాహ్నం ముగిసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!