

సాయుధ దళాల్లో నియామకాల కోసం అమలు చేస్తున్న అగ్నిపథ్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీరుల పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగించింది. దీంతో ఇప్పటివరకు నాలుగేళ్లుగా ఉన్న వారి సేవా కాలం ఆరేళ్లకు పెరగనుంది. ఈ ఏడాది డిసెంబర్ 31న త్రివిధ దళాల నుంచి సుమారు 18 వేల మంది అగ్నివీరులు బయటకు రానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం దీనికి ఆమోదం తెలిపింది.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి ఈ నిర్ణయానికి సంబంధించిన వివరాలను వెల్లడించినట్లు కథనంలో పేర్కొన్నారు. అగ్నివీరుల పనితీరును మదింపు చేసిన అనంతరం శాశ్వత నియామకాలకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం నాలుగేళ్ల సేవ పూర్తయిన తర్వాత అగ్నివీరుల్లో గరిష్ఠంగా 25 శాతం మందిని మాత్రమే ప్రతిభ, సాయుధ దళాల అవసరాల ఆధారంగా శాశ్వత సర్వీసులోకి తీసుకునే అవకాశం ఉంది. మిగిలిన వారికి పౌర ఉద్యోగాల్లో చేరేందుకు వీలుగా ఆర్థిక ప్యాకేజీతోపాటు నైపుణ్య ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!