
టెక్నాలజీ

తెలంగాణ ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం అప్రమత్తమైంది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా బస్సుల నిర్వహణకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. డోర్లు ఉన్న ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సమయంలో వాటిని ఎప్పటికప్పుడు మూసి ఉంచాలని అధికారులను ఆదేశించింది.
అదేవిధంగా డోర్లు లేని బస్సులకు వెంటనే కొత్త డోర్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు నగర, గ్రామీణ ప్రాంతాల్లో నడిచే అన్ని రకాల ఆర్టీసీ బస్సులకు వర్తిస్తాయని యాజమాన్యం ఉత్తర్వుల్లో పేర్కొంది. కండక్టర్ ప్రవళిక మృతి నేపథ్యంలో బస్సుల భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!