

సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ దీక్షిత్‌ను దేశ అత్యున్నత అంతర్గత భద్రతా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) తదుపరి డైరెక్టర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. తెలంగాణ కేడర్‌కు చెందిన 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన, ప్రస్తుత డైరెక్టర్ తపన్ కుమార్ డేకా స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ (ఏసీసీ) ఆమోదించిన ఉత్తర్వుల ప్రకారం, ప్రస్తుతం ఐబీలో స్పెషల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న దీక్షిత్‌కు రెండేళ్ల పదవీకాలం కోసం సర్వీసు పొడిగింపు ఇచ్చారు. గూఢచారి సమాచార సేకరణ, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, జాతీయ భద్రత రంగాల్లో ఆయనకు విస్తృత అనుభవం ఉంది.
ఆర్టికల్ 370 రద్దు ముందు, జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సమయంలో భద్రతా వ్యూహాల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. శ్రీనగర్‌లో జీ20 సమావేశాల విజయవంత నిర్వహణలో కూడా ఆయన పాత్ర ప్రాధాన్యత పొందింది. దేశ అంతర్గత భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఆయన కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!