

భారత్‌లో Apple Pay సేవలను సెప్టెంబర్ చివర్లో లేదా అక్టోబర్ 2026లో ప్రారంభించే అవకాశం ఉందని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. దేశంలోని డిజిటల్ చెల్లింపుల మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు Apple ప్రధాన క్రెడిట్ కార్డు జారీ చేసే బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. తొలిదశలో Visa, Mastercard వంటి నెట్‌వర్క్‌లకు చెందిన క్రెడిట్ కార్డులకు మద్దతు ఇవ్వొచ్చని తెలుస్తోంది. వినియోగదారులు అర్హత ఉన్న కార్డులను Apple Walletలో జోడించి, NFC సదుపాయం ఉన్న పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్ వద్ద కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది.
అయితే ప్రారంభంలో Apple Payలో UPI సదుపాయం ఉండకపోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. UPIని అందించేందుకు అవసరమైన అనుమతులతో పాటు స్పాన్సర్ బ్యాంక్ అవసరం కావడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు, ప్రతి లావాదేవీపై Appleకు లభించే ఫీజుపైనా బ్యాంకులతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. Apple 15–20 బేసిస్ పాయింట్ల ఫీజును కోరుతున్నట్లు, కొన్ని బ్యాంకులు 10 బేసిస్ పాయింట్లకు పరిమితం చేయాలని కోరుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే లాంచ్ తేదీ, ఫీచర్లపై Apple నుంచి ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ లేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!