

తెలంగాణ సర్వే, సెటిల్మెంట్ మరియు భూ రికార్డుల మల్టీజోన్-2 ఉపసంచాలకుడు నరహరిరావు అక్రమాస్తుల వ్యవహారం ఏసీబీ దాడులతో వెలుగులోకి వచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ ఛత్రినాకలోని ఆయన నివాసంతో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు భారీగా నగదు, ఆభరణాలు, స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లోని బీరువాపై ఉన్న కప్‌బోర్డులో దాచిన ఐదు సంచుల్లో రూ.1.54 కోట్ల నగదు లభించింది.
సోదాల్లో అధికారికంగా రూ.13.05 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించగా, వాటి మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండి, రూ.2.29 కోట్ల బ్యాంకు నిల్వలు, రూ.5.04 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు, పలు ఫ్లాట్లు, భవనాలు, వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్లు వెలుగులోకి వచ్చాయి. నరహరిరావు భార్య పేరిట ఉన్న రెండు బ్యాంకు లాకర్లను కూడా అధికారులు గుర్తించారు. సోదాల అనంతరం నరహరిరావును అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!