

తెలంగాణ విద్వేష పూరిత నేరాల బిల్లు–2026పై ఏర్పాటు చేసిన సెలెక్ట్ కమిటీ తొలి సమావేశం అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసేలోపు ఈ బిల్లుకు సంబంధించిన నివేదికను సభకు సమర్పించేందుకు కమిటీ చర్చలు ప్రారంభించింది.
సమావేశం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలను సేకరించిన తర్వాతే తుది నివేదిక సిద్ధం చేస్తామని తెలిపారు. భావ ప్రకటన స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలగకుండా, కులం, మతం, ప్రాంతం, లింగం వంటి అంశాల ఆధారంగా విద్వేష ప్రసంగాలు, విద్వేష నేరాలను నిరోధించే విధంగా చట్టాన్ని రూపొందించనున్నామని చెప్పారు. భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచేలా నిర్మాణాత్మక సూచనలతో నివేదిక రూపొందిస్తామని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!