
జనరల్

తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని తెలిపారు. లండన్‌లో ఉన్న ఆమె, ఎంసిఆర్ హెచ్ఆర్‌డిలో జరిగిన సమన్వయ సమావేశంలో జూమ్ ద్వారా పాల్గొని మంత్రులు, ఉన్నతాధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉందని ఆమె పేర్కొన్నారు. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో ఉత్సవాలు జరగనున్నాయని తెలిపారు. ఘటోత్సవాలు, రంగం, పోతురాజుల వీరంగాలు వంటి సంప్రదాయ కార్యక్రమాలకు భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు విద్యుత్ దీపాలు, పుష్పాలంకరణలు, సీసీ కెమెరాలు, తాగునీరు, పారిశుధ్యం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!