
సినిమాలు

హైదరాబాద్‌లో ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్‌కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు సమాచారం. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పలుమార్లు ఫోన్ చేసిన అగంతకులు, తమ డిమాండ్‌ను నెరవేర్చకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
డబ్బులు ఇవ్వకపోతే డీప్‌ఫేక్, మార్ఫింగ్ చేసిన ఫొటోలు, వీడియోలను బయటపెడతామని అగంతకులు బెదిరించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. కాల్స్ చేసిన వ్యక్తుల వివరాలు, ఫోన్ నంబర్లతో పాటు బెదిరింపుల వెనుక ఉన్న ఉద్దేశాలపై విచారణ జరపనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!