

టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా మాట్లాడటం సబబు కాదని, ఆయన వ్యాఖ్యలను పార్టీ సీరియస్‌గా పరిగణిస్తుందని తెలిపారు. ఈ అంశంపై హైకమాండ్ దృష్టి కూడా ఉందన్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి మంచి మిత్రుడని, ఆయన ఆవేదనను అర్థం చేసుకున్నామని చెప్పారు. పార్టీ లైన్ దాటి ఎవరైనా మాట్లాడితే సహించేది లేదని, క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు. పార్టీకి మొదటి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.
రాష్ట్ర అప్పుల భారానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని, 2018 నుంచి అనేక బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే సీఎం రిలీఫ్ ఫండ్ విడుదలలు జరిగాయని చెప్పారు. తమిళనాడు, తెలంగాణ రాజకీయ పరిస్థితులు వేరని, సన్న బియ్యం కార్యక్రమం తెలంగాణలో తప్ప దేశంలోని ఇతర ప్రాంతాల్లో లేదని పేర్కొన్నారు. తప్పుడు కథనాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగుతాయని, ప్రభుత్వ ప్రధాన నిర్ణయాల్లో పార్టీ పాత్ర కూడా ఉంటుందని అన్నారు. భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేయిస్తోందని ఆరోపించారు. సమర్థులైన వారికే పదవులు ఇస్తామని, రాబోయే చైర్మన్ పదవుల్లో 60 శాతం పాతవారికి, 40 శాతం కొత్తవారికి కేటాయించే విధానం ఉంటుందని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!