

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మ్యూజిక్ సంస్థ సరిగమ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై స్పందించాలని ధర్మాసనం ఆదేశించింది. తమకు కాపీరైట్ హక్కులు ఉన్న పాటలను ఇళయరాజా వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని సరిగమ ఆరోపించింది. గతంలో కోర్టు విధించిన స్టే ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ, పలు చిత్రాల పాటలపై ఇళయరాజా హక్కులు క్లెయిమ్ చేస్తూ వాటిని వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్నారని సంస్థ పేర్కొంది.
స్టే ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు ఇళయరాజాపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని సరిగమ తన తాజా పిటిషన్‌లో కోరింది. అంతేకాకుండా, ఆయన ఆస్తులను జప్తు చేసి, వాటి విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని తమకు చెల్లించేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు, ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఇళయరాజాకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!